దూసుకెళ్తున్న మార్కెట్లు : ‌ హెల్త్‌కేర్‌ షేర్లు జూమ్

Budget 2021 Atmanirbhar Health Yojana Zoom In Health Care Shares - Sakshi

 సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్‌ కేర్‌ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని  ప్రకటించిన నేపథ్యంలో హెల్త్‌ కేర్‌ షేర్లు ఒక్కసారిగా జూమ్‌ అయ్యాయి. నారాయణ హెల్త్‌ కేర్‌ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్‌హెల్త్‌ కేర్‌ ఫోర్టిస్‌ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి.  దీంతో సెన్సెక్స్‌ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌,హెల్త్‌ కేర్‌  రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న ఆమె... ఏళ్లలో రూ . 64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ సెంటర్‌ను బలోపేతం   చేయనున్నామని, ఇందుకోసం దేశంలో కొత్త 15 సెంటర్లను ఏర్పాటు చేస్తామని   ఆర్థికమంత్రి ప్రకటించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top