BSNL: 40వేల కోట్లు సాయం చేయండి, కేంద్రాన్ని ఆశ్రయించిన టెలికాం దిగ్గజం

BSNL approach to central govt for Rs 40,000 crore support from government - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూ.40,000 కోట్ల ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని ఆశ్రయించింది. ఇందులో సగం స్వల్పకాలిక రుణాన్ని చెల్లించడానికి సార్వభౌమ హామీ రూపంలో అవసరమని విన్నవించింది.

‘అదనపు రుణం సంస్థకు అవసరం లేదు. కార్యకలాపాలను నిర్వహించేందుకు వ్యాపారం నిలకడగా మారింది. ఒక లక్ష మొబైల్‌ సైట్లను ఏర్పాటు చేసేందుకు రూ.20,000 కోట్లు కావాలి’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పి.కె.పూర్వార్‌ తెలిపారు. 

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు కలిపి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రకటించిన రూ.69,000 కోట్ల ఉపశమన ప్యాకేజీకి ఇది అదనమని అన్నారు. ప్రస్తుతం సంస్థ రుణ భారం రూ.30,000 కోట్లుంది. టెలికం రంగంలో ఇదే తక్కువ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ చెబుతోంది. 2019–20లో బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు రూ.15,500 కోట్లుంటే.. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,441 కోట్లకు వచ్చి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top