బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విస్తరణ | British Airways sees demand growth in India | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విస్తరణ

Jul 1 2023 6:21 AM | Updated on Jul 1 2023 6:21 AM

British Airways sees demand growth in India - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దాదాపు శతాబ్ద కాలంగా దేశానికి సరీ్వసులు నిర్వహిస్తున్న కంపెనీ తాజాగా ఢిల్లీ, ముంబైలకు మరిన్ని విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. విస్తరణకు అవకాశముండటంతోపాటు.. కోవిడ్‌–19 తదుపరి పలు ప్రాంతాల నుంచి డిమాండు ఊపందుకోవడం ఇందుకు కారణమైనట్లు తెలియజేసింది.

కొత్తగా అధికారిక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో పనిచేస్తున్న 1,700 మందితోపాటు మరో 300 మందికి ఉపాధి కలి్పంచినట్లు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశీ అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చైర్మన్, సీఈవో సీన్‌ డోయల్‌ పేర్కొన్నారు. పలు ప్రాంతాల నుంచి సరీ్వసుల వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో కరోనా మహమ్మారికి ముందుస్థాయిలో ప్రస్తుతం వారానికి 56 విమానాలను నడుపుతున్నట్లు తెలియజేశారు.  

మెట్రో నగరాలకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ సరీ్వసులను నిర్వహిస్తున్నట్లు డోయల్‌ తెలియజేశారు. ఇటీవలి వరకూ 49 విమానాలను నడిపినట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎయిర్‌ సర్వీస్‌ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైలకు విమాన సరీ్వసులను పెంచనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా 2,000 మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉన్నట్లు కంపెనీ చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ కేలమ్‌ లామింగ్‌ తెలియజేశారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35,000 మంది సిబ్బందిని కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement