సంచలన కథనం: గేట్స్‌ వెకిలి మెయిల్స్‌.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌!

Bill Gates Warned By Microsoft Employees Over Filrt Emails - Sakshi

ఇదేం కొత్త ఆరోపణ కాదు. కాకపోతే  మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చిలిపి చేష్టలు’ తమ దృష్టికి రావడంతో మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ స్వయంగా ఆయన్ని మందలించారనే కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ మేరకు వాల్‌​స్ట్రీట్‌ జర్నల్‌ సోమవారం ఒక కథనం ప్రచురించింది. సదరు ఘటన 2008లో జరిగింది. ఓ మిడ్‌ లెవల్‌ ఉద్యోగితో పులిహోర కలుపుతూ ఆయన(బిల్‌ గేట్స్‌) పంపిన మెయిల్స్‌ వ్యవహారం మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ దృష్టికి వచ్చింది. దీంతో జనరల్‌ కౌన్సెల్‌ బ్రాడ్‌ స్మిత్‌(మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌, వైస్‌ చైర్మన్‌ ), మరికొందరు ఎగ్జిక్యూటివ్స్‌ కలిసి గేట్స్‌ను వ్యక్తిగతంగా సంప్రదించారు.  అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు ఆపితే మంచిదని ఆయన్ని సున్నితంగా మందలించారు కూడా!.

  

ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బిల్‌గేట్స్‌ నీళ్లు నమలడం,  ఉద్యోగిణికి కేవలం వెకిలి  మెయిల్స్‌ మాత్రమే పంపడం, పైగా శారీరక సంబంధం దాకా యవ్వారం వెళ్లకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలిపెట్టారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆ కథనంలో పేర్కొంది.  ఇక ఈ కథనంపై ఇటు మైక్రోసాఫ్ట్‌గానీ, అటు స్మిత్‌గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్‌ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది.

 

ఇదిలా ఉంటే 2019లో బిల్‌గేట్స్‌ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్‌ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లైంగిక ఆరోపణలపై న్యాయపరమైన విభాగంతో దర్యాప్తునకు ఆదేశించింది మైక్రోసాఫ్ట్‌. ఆ దర్యాప్తు గోప్యంగా కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్‌ బోర్డ్‌ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఎప్పుడైతే బిల్‌ గేట్స్‌,  మెలిండా ఫ్రెంచ్‌ విడాకులు ప్రకటించారో.. అప్పటి నుంచి వరుసబెట్టి ఆయనపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా బిల్‌గేట్స్‌ చిలకొట్టుడు వ్యవహారాలే మెలిండాతో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి కారణమనే వాదన సైతం తెర మీద వినిపిస్తుంటోంది.

చదవండి: గేట్స్‌ దంపతులు విడిపోవడానికి కారణం ఎవరంటే..

క్లిక్‌ చేయండి: ‘బిల్‌గేట్స్‌ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top