
రోజంతటి అలసట ఇట్టే పోగొట్టే మందు ఒక్కటే, అదే హాయినిద్ర!. అందుకే, ప్రపంచాన్ని మరచిపోయేలా, ప్రశాంతమైన నిద్రకోసం ఇవి మీ బెడ్‌రూమ్‌లో తప్పకుండా ఉండాలి.
మాయాదీపం!
ఊహించుకోండి.. మీ మంచం పక్కన ఒక చిన్న మాయాదీపం ఉందని. ఎందుకంటే, ఈ బెడ్‌సైడ్ ల్యాంప్, సాధారణ బెడ్‌ల్యాంప్ కాదు. ఇదొక మూడ్ మ్యాజిక్, మల్టీ యూజ్ ఫ్రెండ్. రాత్రి పడుకున్నప్పుడు ఒక్క టచ్ చేస్తే మెల్లగా వెలిగే వార్మ్ లైట్‌తో పాటు, పుస్తకం చదవాలనిపిస్తే కూల్ వైట్ లైట్, పార్టీ మూడ్‌కి బ్రైట్ లైట్. అన్నీ మీ వేళ్ల అంచుల్లోనే! మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందా? ప్లగ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ల్యాంప్ మీద ఫోన్ పెట్టేయండి. వాచ్, ఇయర్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలన్నింటినీ దీంతోనే చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఉన్న డిజిటల్ క్లాక్‌తో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ధర రూ. 3,900.
ఆకాశం అంతా మీ గదిలోనే!
ఆరుబయట మంచం వేసుకొని చుక్కలు లెక్కపెడుతూ పడుకునే రోజులు గుర్తున్నాయా? గాలి తాకుతూ, ఆకాశం చూస్తూ కలల్లో తేలిపోయే ఆ మజానే వేరు. ఇప్పుడు ఆ అనుభూతి మళ్లీ పొందటానికి ఆరుబయట మంచం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకాశం అంతా మీ గదిలోకే దిగిపోతుంది. ఒక్కసారి ఈ స్టార్‌షిప్ ల్యాంప్ ఆన్ చేస్తే, గది గోడల మీద నక్షత్రాలు, చంద్రుడు, మేఘాలు, గ్రహాలు అన్నీ మెరిసిపోతూ మీ గదినే గగనమండలంలా మార్చేస్తాయి. మొబైల్‌కి కనెక్ట్ చేసుకొని యాప్ ద్వారా కలర్స్, బ్రైట్‌నెస్, స్పీడ్ అన్నీ మీ మూడ్‌కి తగినట్టుగా మార్చుకోవచ్చు. టైమర్ సెట్ చేస్తే మీరు కలల్లో తేలుతుండగానే దానంతట అదే ఆఫ్ అవుతుంది. ధర రూ.2,890.
ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
వెచ్చని దుప్పటి
చల్లని రాత్రుల్లో వణుకుతూ నిద్రపోవడం ఇక మానేయండి. ఎందుకంటే ఇప్పుడు హీటెడ్ అండర్ బ్లాంకెట్ ఉంది. ఒక్క బటన్‌తో మీ మంచాన్ని వెచ్చగా, సౌకర్యంగా మార్చేస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా ఈజీ. దుప్పటిని మంచం మీద సెట్ చేసి, పవర్‌కి కనెక్ట్ చేయండి. కంట్రోల్ స్విచ్‌లో మీకు కావాల్సిన లో, మీడియం, హై అనే ఉష్ణస్థాయులను ఎంచుకోండి. నిమిషాల్లోనే మంచం మొత్తం వెచ్చగా మారిపోతుంది. రాత్రంతా వెచ్చదనం కొనసాగుతుంది. ఉదయం లేవగానే కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే చాలు. ఉతకాల్సినప్పుడు ప్లగ్ తీసేసి వాషింగ్ మెషిన్ లో వేసేసుకోచ్చు. మృదువైన, నాణ్యమైన కాటన్ తో తయారైన ఈ దుప్పటి ధర కేవలం రూ.3,749 మాత్రమే!