2024లో బ్యాంక్‌ సెలవులు ఇవే.. | Bank Holidays In 2024. Check The Full List Here - Sakshi
Sakshi News home page

2024లో బ్యాంక్‌ సెలవులు ఇవే..

Published Fri, Dec 22 2023 4:52 PM

Bank Holidays For The Of Year 2024 - Sakshi

ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లనిదే పనులు జరిగేవి కావు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మెబైల్‌లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. ఖాతా తెరవడం దగ్గర నుంచి ఇతరులకు నగదు పంపించడం వరకు చాలా పనులు దీంతోనే చెక్కబెట్టేస్తున్నారు. 

అయితే, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్‌లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా ప్లాన్‌ చేసుకోవాలి. తీరా ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కాబట్టి బ్యాంకు శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. 

2024లో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి..

జనవరి..

 • జనవరి 1- సోమవారం- నూతన సంవత్సరం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
 • జనవరి 11- గురువారం- మిషనరీ డే- మిజోరం
 • జనవరి 12- శుక్రవారం- స్వామి వివేకానంద జయంతి- బంగాల్
 • జనవరి 13- రెండో శనివారం/లోహ్రి- దేశవ్యాప్తంగా సెలవు
 • జనవరి 14- ఆదివారం- సంక్రాంతి- దేశవ్యాప్తంగా హాలిడే ఉంది.
 • జనవరి 15- సోమవారం- పొంగల్, తిరువళ్లూర్ డే- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సెలవు
 • జనవరి 16- మంగళవారం- తుసు పూజ- బంగాల్, అసోంలో సెలవు
 • జనవరి 17- బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో సెలవు
 • జనవరి 23- మంగళవారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి- పలు రాష్ట్రాల్లో ఉంది.
 • జనవరి 25- గురువారం- స్టేట్ డే- హిమాచల్ ప్రదేశ్
 • జనవరి 26- శుక్రవారం- రిపబ్లిక్ డే- దేశవ్యాప్తంగా సెలవు
 • జనవరి 27- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా సెలవు
 • జనవరి 31- బుధవారం- మి-డామ్-మే-ఫి- అసోం

ఇదీ చదవండి: దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్‌’ ముఠా..! ఫొటోలు వైరల్‌

ఫిబ్రవరి..

 • ఫిబ్రవరి 10- రెండో శనివారం
 • ఫిబ్రవరి 15- గురువారం- లుయ్-ఎంగయ్-ని - మణిపుర్
 • ఫిబ్రవరి 19- సోమవారం- శివాజీ జయంతి- మహారాష్ట్ర
 • ఫిబ్రవరి 24- నాలుగో శనివారం

మార్చి..

 • మార్చి 8- శుక్రవారం- మహాశివరాత్రి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
 • మార్చి 23- శనివారం- భగత్ సింగ్ మార్టిర్‌‌డమ్ డే - పలు రాష్ట్రాల్లో సెలవు
 • మార్చి 25- సోమవారం- హోలీ (గెజిటెడ్ హాలిడే)
 • మార్చి 29- గుడ్‌ఫ్రైడే- శుక్రవారం (గెజిటెడ్ హాలిడే)

ఏప్రిల్..

 • ఏప్రిల్ 9 - మంగళవారం- ఉగాది - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సెలవు
 • ఏప్రిల్ 10- ఈద్- ఉల్- ఫితుర్- బుధవారం (గెజిటెడ్ హాలిడే)
 • ఏప్రిల్ 13- రెండో శనివారం
 • ఏప్రిల్ 14- ఆదివారం- అంబేడ్కర్ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు
 • ఏప్రిల్ 17- శ్రీరామనవమి- బుధవారం- చాలా రాష్ట్రాల్లో సెలవు
 • ఏప్రిల్ 21- ఆదివారం
 • ఏప్రిల్ 27- నాలుగో శనివారం

ఇదీ చదవండి: ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..

మే..

 • మే 1- బుధవారం- దేశవ్యాప్తంగా సెలవు (మే డే)
 • మే 11- రెండో శనివారం
 • మే 25- నాలుగో శనివారం

జూన్..

 • జూన్ 8 - రెండో శనివారం
 • జూన్ 16- ఆదివారం
 • జూన్ 22- నాలుగో శనివారం

జులై..

 • జులై 13- రెండో శనివారం
 • జులై 17- బుధవారం- మొహర్రం- దేశవ్యాప్తంగా సెలవు (కొన్ని రాష్ట్రాల్లో మినహా)
 • జులై 27- నాలుగో శనివారం

ఆగస్టు..

 • ఆగస్టు 10- రెండో శనివారం
 • ఆగస్టు 15- గురువారం- స్వాతంత్య్ర దినోత్సవం- దేశవ్యాప్తంగా సెలవు
 • ఆగస్టు 19- సోమవారం- రాఖీ- యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా
 • ఆగస్టు 24- నాలుగో శనివారం
 • ఆగస్టు 26- సోమవారం- కృష్ణాష్టమి- చాలా రాష్ట్రాల్లో

సెప్టెంబర్..

 • సెప్టెంబర్ 7 - శనివారం- వినాయక చవితి- దేశవ్యాప్తంగా సెలవు
 • సెప్టెంబర్ 8- ఆదివారం
 • సెప్టెంబర్ 16- సోమవారం- ఈద్- ఇ- మిలాద్- దేశవ్యాప్తంగా సెలవు
 • సెప్టెంబర్ 28- నాలుగో శనివారం.

ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..?

అక్టోబర్..

 • అక్టోబర్ 2- గాంధీ జయంతి- దేశవ్యాప్తంగా సెలవు- బుధవారం
 • అక్టోబర్ 10- మహాసప్తమి- గురువారం- దేశవ్యాప్తంగా సెలవు
 • అక్టోబర్ 11- మహా అష్టమి- శుక్రవారం- పలు రాష్ట్రాల్లో
 • అక్టోబర్ 12- రెండో శనివారం- విజయదశమి
 • అక్టోబర్ 26- నాలుగో శనివారం

నవంబర్..

 • నవంబర్ 9 - రెండో శనివారం
 • నవంబర్ 23- నాలుగో శనివారం

డిసెంబర్..

 • డిసెంబర్ 14- రెండో శనివారం
 • డిసెంబర్ 25- బుధవారం- క్రిస్మస్- దేశవ్యాప్తంగా సెలవు
 • డిసెంబర్ 28- నాలుగో శనివారం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement