88.5% ట్రేడర్లు 30 ఏళ్లలోపు వారే..
సెబీ 2025–26 నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: గతేడాది (2025–26)లో డెరివేటివ్స్ లావాదేవీల ద్వారా యువత అత్యధికంగా నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఎఫ్‌అండ్‌వోలో నష్టపోయిన వారిలో 88.5 శాతం ట్రేడర్లు 30 ఏళ్లలోపువారేనని తెలియజేసింది.
మొత్తం ట్రేడర్ల సంఖ్యలో వీరు 43 శాతంకాగా.. 73 శాతంమంది రూ. 5 లక్షలకులోపు వార్షిక ఆదాయం కలిగినవారుగా నివేదిక పేర్కొంది. చాలా సందర్భాలలో ఎఫ్‌అండ్‌వో లావాదేవీలలో 90 శాతానికి మించి నష్టపోతున్నట్లు వివరించింది. అంతేకాకుండా తమ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకంటే 93 రెట్లు అధికంగా డెరివేటివ్స్ టర్నోవర్ నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. 50 ఏళ్లకుపైబడినవారిలో ఇది సగటున 20 రెట్లుగా నమోదవుతున్నట్లు పేర్కొంది.


