‘హార్ట్‌ ఎటాక్‌’ను గుర్తించే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8పై భారీ డిస్కౌంట్లు!

Apple Watch Series 8 Gets Discounts Of Up To Rs. 20,900 During Unicorn Apple Fest - Sakshi

హార్ట్‌ ఎటాక్‌ అంటే ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు వారికేననే ఓ అభిప్రాయం ఉండేది. అయితే ఆ ముప్పు ఇప్పుడు యువతను, చిన్నారులను చుట్టుముడుతోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలల్లో హటాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండె పోటు అంటారు. 

మరి గుండెకు రక్తం, ఆక్సీజన్‌ సరిగ్గా అందకపోతే అది పంపింగ్‌ చేయలేదు. ఎంత ఎక్కువ సేపు అడ్డంకి ఏర్పడితే అంత నష్టం జరుగుతోంది. పురుషుల్లో ఇలాంటి గుండె పోట్లు 65 ఏళ్లకు, మహిళలకు 72 ఏళ్లకు వస్తాయనే పాతలెక్క. కానీ ఆ వయస్సు ఇటీవల కాలంలో క్రమంగా కిందకు పడిపోతుంది.

యువకుల్లో గుండెకు సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలా సార్లు నిశబ్ధంగా విరుచుకుపడి ప్రాణాల మీదకు తెస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనల్ని పెంచుతున్నాయి. దీని కారణం ఏంటనేది వైద్య నిపుణులు రకరకాల అంశాలను ఉదహరిస్తుండగా.. ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌.. పైన పేర్కొన్నట్లుగా గుండె సంబంధిత సమస్యల్ని ముందే గుర్తించి యూజర్లను అలెర్ట్‌ చేసేందుకు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8ను గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసింది. 

అయితే ఈ నేపథ్యంలో యాపిల్‌ కంపెనీ ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకొని యూనికార్న్‌ స్టోర్‌ అనే సంస్థ వాటిని నేరుగా భారత్‌లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు అదే సంస్థ యాపిల్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. వాటిలో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8 కూడా ఉంది.   

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8 ఫీచర్లు
యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8లో గుండె పనితీరు సంబంధించిన సమస్యల్ని గుర్తించవచ్చు. అలా గుర్తించేందుకు టెక్‌ దిగ్గజం ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లడ్‌లో నీరసం, అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా చూసేందుకు ఉపయోగపడే హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయో గుర్తించడం, గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్‌ చేయడం, కర్ణిక దడ (atrial fibrillation detection)ని గుర్తించడం, గుండెలోని విద్యుత్ సంకేతాలను కొలిచే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (Electrocardiogram (ECG)ను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది.

ఈ పర్యవేక్షణ గుండె సమస్యలను గుర్తించడానికి, గుండె ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు టెంపరేచర్‌ సెన్సార్‌, దంపతులు ఏ సమయంలో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో గుర్తించే అండోత్సర్గము(ovulation cycles) అనే ఫీచ‌ర్‌ను యాపిల్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.   

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8పై ఆఫర్లు
పోయిన ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8 ధర రూ.45,900 ఉండగా.. ఇప్పుడు ఆ ధర భారీగా తగ్గించింది. కొనసాగుతున్న యునికార్న్ యాపిల్ ఫెస్ట్‌లో భాగంగా వినియోగదారులు యాపిల్‌ వాచ్ సిరీస్ 8 పై 12 శాతం తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లు, ఈజీ ఈఎంఐ  లావాదేవీలపై రూ. 3,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ.2 వేల వరకు క్యాషీఫై ఎక్ఛేంజ్‌ బోనస్‌ ఆఫర్‌ సొంతం చేసుకోవచ్చు. ఇలా అన్నీ బెన్‌ఫిట్స్‌ కలుపుకొని యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8 ప్రారంభ ధర రూ.25,000 నుంచి లభ్యమవుతుందని యానికార్న్‌ యాపిల్‌ ఫెస్ట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

చదవండి👉 ఏం ఫీచర్లు గురూ..అద‌ర‌గొట్టేస్తున్నాయ్‌,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుద‌ల!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top