Amazon Prime Day Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్‌లు

Amazon Prime Day Sale Best Mobile Offers - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన కస్టమర్లకు ప్రైమ్‌ డే సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌ భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్లపై  తగ్గింపును అమెజాన్‌ ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్‌లు

  • ఆపిల్‌ ఐఫోన్‌ 11పై సుమారు రూ. 6900 తగ్గింపు ధరతో  రూ. 47, 999 అందించనుంది. అసలు ధర. రూ 54,900
  • వన్‌ప్లస్‌ 9పై తొలిసారిగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. కూపన్ల రూపంలో సుమారు రూ. 4000 వరకు తగ్గింపును అందిస్తోంది.
  • వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను ప్రైమ్‌ డే సేల్‌ సందర్భంగా రూ. 22, 999 కు లభించనుంది. 6 నెలల నోకాస్ట్‌ ఈఎమ్‌ఐ రూపంలో కూడా కోనుగోలు చేయవచ్చును. 
  • షావోమి ఎమ్‌ఐ 11ఎక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 6000 తగ్గింపు ధరతో రూ. 27,999 అందించనుంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 33,999.
  • రెడ్‌మీ నోట్‌ 10 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.1000 తగ్గింపు ధరతో రూ. 13,999 ధరకు అందించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ పేతో కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్‌ బ్యాక్‌ను అందించనుంది. 
  • రియల్‌మీ సి 11 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ లాంచ్‌ చేయనుంది. లాంచ్ ధర రూ .6,999 కాగా ఈ సేల్‌ భాగంగా రూ. 6,699 కు అందించనుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top