భారత్‌లో అమెజాన్‌ సరికొత్త మైలురాయి..! 100 నుంచి ఏకంగా 10 లక్షల వరకు..! | Sakshi
Sakshi News home page

Amazon: భారత్‌లో అమెజాన్‌ సరికొత్త మైలురాయి..! 100 నుంచి ఏకంగా 10 లక్షల వరకు..!

Published Thu, Dec 16 2021 9:20 PM

Amazon India Crosses Milestone Of 10 Lakh Sellers On Its Platform - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో సరికొత్త మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 10 లక్షల మంది విక్రయదారులు అమెజాన్‌లో ఆన్‌బోర్ట్‌ ఐన్నట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

100 నుంచి మొదలు..!
2013లో అమెజాన్‌ ఇండియా  కేవలం 100 మంది విక్రయదారులను ఆన్‌బోర్డ్‌ చేసుకోగా..ప్రస్తుతం ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. Amazon.inలో 90 శాతం కంటే ఎక్కువ మంది విక్రేతలు చిన్న, మధ్యస్థ స్థానిక వ్యాపారాలను కల్గి ఉన్నారు. వీరు టైర్‌-2, టైర్‌-3 నగరాల నుంచి వచ్చారు. 2020 జనవరి నుంచి 4.5 లక్షలకు పైగా కొత్త విక్రేతలు అమెజాన్‌లో చేరారని కంపెనీ పేర్కొంది. 
చదవండి: సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన

63 మిలియన్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలతో...
భారత్‌లోని పలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలపై అమెజాన్‌ ఇండియా దృష్టిసారించింది. సుమారు 63 మిలియన్ల మధ్యస్థ,చిన్న సూక్ష్మ పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను అమెజాన్‌ నెలకొల్పింది.  స్థానిక రిటైలర్లకు వారి వ్యాపారాల అభివృద్ధికి అమెజాన్‌  ఎంతగానో సహయం అందించిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు. 

చదవండి: ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!

Advertisement

తప్పక చదవండి

Advertisement