కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.
— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026
''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.
దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.


