ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరోసారి ఫ్రీడమ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే.. కేవలం రూ.1 ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. తీసుకొచ్చిన ఒక రూపాయి ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా ఉచిత సిమ్ కార్డు పొందవచ్చు. ఆ తరువాత యూజర్లకు నెల రోజులు (30 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో 30 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను మరోసారి తీసుకురావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల డిమాండ్ అని తెలుస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు (ఏప్రిల్ 30) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
Freedom is back and it’s bigger than ever!
Get your FREE SIM at just ₹1 and enjoy unlimited calls, daily data and SMS benefits without breaking the bank.#BSNL #FreedomOffer #1RupeeOffer #BudgetFriendly #UnlimitedCalls #DailyData #TelecomDeals #IndiaOffers @CMDBSNL… pic.twitter.com/cjt1PB61lX— BSNL India (@BSNLCorporate) April 6, 2026


