అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు | India Unincorporated Sector Jobs Surge New Opportunities | Sakshi
Sakshi News home page

అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు

Apr 3 2026 9:10 AM | Updated on Apr 3 2026 10:42 AM

India Unincorporated Sector Jobs Surge New Opportunities

అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు 2025లో 6.18 శాతం పెరిగి 12,80,51,800కు చేరాయి. గతేడాది 74.52 లక్షల కొత్త అవకాశాలు వచ్చాయి. ఇందులో 35 లక్షల ఉపాధి అవకాశాలు ఇతర సేవల విభాగంలో ఏర్పడ్డాయి. ఈ వివరాలను అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఆసుసే) నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఈ వార్షిక సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 2023 అక్టోబర్‌ చివరికి ఈ రంగలో ఉపాధి అవకాశాలు 12,05,99,800గానే ఉన్నాయి.

అసంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 7.34 కోట్ల నుంచి 7.92 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఇతర సేవల విభాగంలో సంస్థల సంఖ్య 10.29 శాతం పెరిగింది. ఆ తర్వాత తయారీ రంగంలో 6.48 శాతం, వాణిజ్య విభాగంలో 6.18 శాతం చొప్పున కొత్త సంస్థలు అవతరించాయి. ఆర్థిక పనితీరును సూచించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) 10.87 శాతం ఎగిసింది. ట్రేడ్‌ విభాగంలో 16.77 శాతం, తయారీలో 8.52 శాతం, సేవల విభాగంలో 7.36 శాతం మేర జీవీఏ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఇతర సేవల విభాగం వాటా జీవీఏలో 42 శాతంగా ఉంటే, ట్రేడ్‌ విభాగం 37 శాతం, తయారీ 21 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఒక్కో కారి్మకుడి జీవీఏ (కార్మికుల ఉత్పాదకత) 2023–24లో ఉన్న రూ.1,49,742 నుంచి రూ.1,56,539కు చేరింది. అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ అంటే వ్యవసాయేతర రంగాల్లోని ప్రైవేటు సంస్థలతో కూడినది కావడం గమనార్హం.  

మహిళా సంస్థల్లో వృద్ధి..

మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు 2023–24లో 26.2 శాతంగా ఉంటే, 2025లో 27 శాతానికి పెరిగాయి. ఒక్కో ఉద్యోగికి చెల్లించే వేతనం గతేడాది 3.88 శాతం పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్‌ విభాగంలో కారి్మకుల వేతనం అత్యధికంగా 8.5 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్‌ను వినియోగించే సంస్థల సంఖ్య సైతం 26.7 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగాయి. వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ స్వీకరణను ఇది తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 6,70,289 సంస్థల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement