'హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు' | Hyderabad Logs Record Office Transactions in Q1 2026 Residential Sales Steady | Sakshi
Sakshi News home page

పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్

Apr 7 2026 6:13 PM | Updated on Apr 7 2026 6:54 PM

Hyderabad Logs Record Office Transactions in Q1 2026 Residential Sales Steady

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 త్రైమాసిక రియల్ ఎస్టేట్ నివేదిక విడుదల చేసింది. ఇందులో నగరంలో ఆఫీస్, రెసిడెన్షియల్ మార్కెట్లకు డిమాండ్ అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 5.86 మిలియన్ చదరపు అడుగులకు చేరుకొని, ఒకే త్రైమాసికంలో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. గత సంవత్సరం పోలిస్తే.. ఇది 48% వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండవ అతిపెద్ద ఆఫీస్ మార్కెట్‌గా నిలిచింది.

ఈ వృద్ధికి ప్రధాన కారణంగా.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) అని తెలుస్తోంది. మొత్తం లీజింగ్‌లో 43 శాతం వాటాను వీటిదే కావడం గమనార్హం. జీసీసీలు 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే థర్డ్-పార్టీ సర్వీసెస్ రంగం కూడా 1.7 మిలియన్ చదరపు అడుగులతో 29 శాతం వాటా సాధించింది. మరో ముఖ్యమైన అంశం ఫ్లెక్స్ వర్క్‌స్పేస్‌లు. ఇవి 457 శాతం వృద్ధితో 1.42 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు, ముఖ్యంగా GCCలు ఈ ఫ్లెక్స్ స్పేస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.

నివాస రంగం విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో గృహ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2026 Q1లో 9,541 గృహాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలీసైతే 1 శాతం వృద్ధిని చూపిస్తుంది. గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ.8,211గా ఉండి 9 శాతం పెరిగింది. ప్రజలు చాలామంది విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక ద్వారా తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement