ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం! | Unemployed Techie Walks Into 7 Offices With Resumes Shares Experience | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!

Apr 3 2026 3:22 PM | Updated on Apr 3 2026 3:44 PM

Unemployed Techie Walks Into 7 Offices With Resumes Shares Experience

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న.. ఈ కాలంలో టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం.. ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ఎక్కువగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ వంటివాటిపై మొగ్గు చూపుతున్న కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ టెకీ.. పాతకాలపు విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు నేరుగా కంపెనీలకు వెళ్లి ఉద్యోగం సెర్చ్ చేయమని సూచించడంతో.. దాన్నే ఫాలో అయ్యాడు. తాను ఉంటున్న నగరంలోనే ఏడు కంపెనీలను సందర్శించారు.

మొదట రెండు పెద్ద కంపెనీలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినప్పుడు, అక్కడి సిబ్బంది అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని చెప్పారు. అంతే కాకుండా అసలు వారు పేపర్ రెజ్యూమ్ తీసుకోలేదు. ఇంకో రెండు చిన్న కంపెనీలకు వెళ్లినప్పుడు, ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చాలా కాలం క్రితం పెట్టారని, అది తప్పుగా మళ్లీ కనిపించిందని చెప్పారు. మరొక కంపెనీ అతని రెజ్యూమ్ తీసుకున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని సూచించిందని అతడు పేర్కొన్నాడు.

మిగిలిన మూడు కంపెనీల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రెండు కంపెనీలు అసలు అక్కడ లేవు. ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. చివరికి ఒక చోటకి అతను వెళ్లినప్పుడు, అది ఒక పెద్ద గది మాత్రమే ఉండి, అందులో ఇద్దరు వ్యక్తులు ల్యాప్‌టాప్‌లతో పని చేస్తూ కనిపించారు. వాళ్లను కంపెనీ గురించి అడిగితే.. వారు అయోమయంగా చూసి అతన్ని వెళ్లమని చెప్పినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

ఉద్యోగం సెర్చ్ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన అనుభవాన్ని.. అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ కాలంలో నేరుగా వెళ్లి ఉద్యోగం కోసం అడగడం ఉండదని.. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలామంది చెప్పారు. కొందరు మాత్రం అరుదుగా ఈ విధానం పనిచేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement