బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌  | Aditya Birla Capital Enters Gold Loan Business | Sakshi
Sakshi News home page

బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ 

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

Aditya Birla Capital Enters Gold Loan Business

మూడేళ్లలో 1,000 శాఖల టార్గెట్‌ 

ముంబై: పసిడి రుణాల విభాగంలోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 300 శాఖలను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ సింగ్‌ తెలిపారు. మొత్తం మూడేళ్లలో 1,000 గోల్డ్‌ లోన్‌ శాఖలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 

పసిడి ధర పెరుగుదలతో బంగారంపై రుణాలు కూడా భారీగా ఎగిసినట్లు సింగ్‌ చెప్పారు. జూన్‌ గణాంకాలు చూస్తే బంగారం ఆభరణాలపై నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచి్చన రుణాలు వార్షికంగా దాదాపు 69.3 శాతం పెరిగాయి. 2026 జూన్‌ ఆఖరు నాటికి పసిడి ఆభరణాలపై ఎన్‌బీఎఫ్‌సీల మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియో 69 % వృద్ధితో రూ. 3.42 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement