LocalCirclesSurvey: ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్‌ రిపోర్ట్‌

56 pc indians Call Drop Issues 82 pc Doing To Overcome It Survey - Sakshi

న్యూఢిల్లీ: దేశం  వేగవంతమైన 5 జీ నెట్‌వర్క్‌ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్‌వర్క్‌ సమస్యలపై షాకింగ్‌ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.  వినియోగదారులకు కాల్‌డ్రాప్‌, కాల్‌ కనెక్ట్‌ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి  అనుభవమే. తాజాగా  దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ  నెట్‌వర్క్‌ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు  82 శాతం మంది ప్రజలు ఈ నెట్‌వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది.

సర్వే ప్రకారం  గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్‌లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్‌పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా,  56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు.

కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది.  ఇందులో టైర్ 1 నగరాల్లోని  42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్‌  సమస్య రాలేదని సర్వే తేల్చింది.  డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ  మొబైల్ నెట్‌వర్క్‌ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top