పచ్చని చెట్టు నరికేశారు! | - | Sakshi
Sakshi News home page

పచ్చని చెట్టు నరికేశారు!

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

అశ్వారావుపేటరూరల్‌: ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న పచ్చని చెట్టును నరికివేసిన ఘటన ఇది. మండలంలోని ఊసిర్లగూడెం గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నేరేడు వృక్షం ఉంది. కాయలు కాస్తున్న ఈ భారీ వృక్షాన్ని ప్రహరీ గోడకు అడ్డుగా ఉందనే సాకుతో నరికివేశారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో చెట్లు నాటాలని, వాటి సంరక్షించాలని పాఠాలు బోధించే గురువులే చిన్న చిన్న సాకులు చెప్పి భారీ వృక్షాన్ని నరికించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై పాఠశాల ఉపాధ్యాయుడు మల్లేశ్‌ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల అనుమతితోనే వృక్షాన్ని నరికించినట్లు చెప్పడం గమనార్హం.

సకాలంలో

రైతులకు యూరియా

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన యూరియా బుకింగ్‌ విధానం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా వ్యవసాయ అధికా రి బాబూరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచడంతో పాటు, బుక్‌ చేసి న రైతులకు వేగవంతంగా సరఫరా చేస్తున్నా మని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 10,014 మంది రైతులు 39,944 బస్తాల యూరియా బుక్‌ చేసుకున్నారని, అందులో 28,980 (72.66 శాతం)బస్తాలు రైతులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం జిల్లాలో 1,304.10 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను బుక్‌ చేసుకోవాలని, అధికంగా కొను గోలు చేయాల్సిన అవసరం లేదని సూచించా రు. వివరాలకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), వ్యవసాయ అధికారి (ఏఓ), మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)లను సంప్రదించాలని ఆయన సూచించారు.

బ్రిడ్జి మరమ్మతుల పరిశీలన

చుంచుపల్లి: ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ నుంచి బొమ్మనపల్లి క్రాస్‌ రోడ్‌ మధ్య లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారిపై రైల్లే ఓవర్‌ బ్రిడ్జ్‌ మరమ్మతు పనులను శుక్రవారం ఎస్పీ రోహిత్‌ రాజు అధికారులతో పరిశీలించారు. ఇల్లెందు క్రాస్‌రోడ్‌, బొమ్మనపల్లి క్రాస్‌రోడ్‌, లోతువాగు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ మల్లింపు వల్ల ప్రజలు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన సూచిక బోర్డులతో పాటు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో రిఫ్లెక్టివ్‌ జాకె ట్లు ధరించి ట్రాఫిక్‌ మళ్లింపు చేయాలని చెప్పా రు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినా రాయణ, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫి క్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌, లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అఖిల, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఆశ’ సభ్యులుగా

రామ్మూర్తి, షాజహాన్‌

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆశ’స్కీమ్‌ లో ప్యానెల్‌ న్యాయవాదులుగా సీనియర్‌ న్యా యవాదులు గాజుల రామ్మూర్తి, షాహజాన్‌ పర్వీన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత శుక్రవారం నియమించారు. వీరు బాల్య వివాహాలను అరికట్టడం, బాధిత బాలి కలకు సహాయం అందించడం, అవసరమైన న్యాయ పరిరక్షణ కల్పించడం, అలాగే ప్రజలలో చట్టపరమైన అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన సందర్భంలో తక్షణ చర్యలకు సమన్వయం చేసి, సేవలను అందిస్తారని వివరించారు.

మధ్యాహ్న భోజన

సిబ్బందికి శిక్షణ

కొత్తగూడెంఅర్బన్‌: ఆనందఖని పాఠశాల మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి స్థానిక విద్యాశాఖ ట్రైనింగ్‌ సెంటర్‌లో శుక్రవారం ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంభుప్రసాద్‌ మాట్లాడారు. నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలను ఉపయోగించాలని, పరిశుభ్రమైన నీటితో కడగాలని, వంట పాత్రలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారమే వంట తయారు చేయాలని చెప్పా రు. కలుషితమైన ఆహార పదార్థాలను వాడొద్దని, నాణ్యమైన తాజా కోడిగుడ్లను అందించాలని సూచించారు. విజయబాబు, తోట మాధవరావు, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement