‘పీఠ’ముడి!
న్యూస్‌రీల్
ఇల్లెందు, కొత్తగూడెంలో
కొనసాగుతున్న సస్పెన్స్
పాలన పగ్గాల కోసం
భారీగా నెలకొన్న పోటీ
రిజర్వ్‌డ్‌తోపాటు జనరల్
స్థానాల నుంచీ బరిలోకి..
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మేయర్/ చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే అశ్వారావుపేటలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులపై ప్రధాన పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. కానీ పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లెందు విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అంశంపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మక గోప్యత పాటిస్తున్నాయి. దీంతో అదృష్టం కలిసి రావొచ్చనే భావనతో ఆశావహులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ఆక్సిజన్–18కు ప్రాధాన్యం
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆ డివిజన్లపై ఫోకస్
జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ మేయర్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా ఆచితూచీ అడుగులు వేస్తున్నాయి. మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఏ పార్టీ నుంచీ స్పష్టత రావడం లేదు. ముందుగా మెజారిటీ డివిజన్లలో గెలుపు సాధించి, ఆ తర్వాత మేయర్ ఎన్నికపై ఆలోచిద్దాం అన్నట్టుగా ఆయా పార్టీల నాయకత్వాలు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, అందులో ఎస్టీ మహిళా కోటాలో 9, 23, 31, 34, 52 డివిజన్లు ఉండగా, ఎస్టీ జనరల్ కేటగిరీలో 3, 19, 20, 32, 33, 48 మొత్తంగా ఎస్టీలకు పదకొండు డివిజన్లు ఉన్నాయి. ఇవి కాకుండా జనరల్ స్థానా లుగా 14 డివిజన్లు ఉన్నాయి. దీంతో మొత్తంగా 25 డివిజన్లు ఎస్టీ జనరల్ అభ్యర్థులు పోటీ చేసేందుకు అనువుగా ఉన్నాయి. మేయర్ స్థానం ఆశిస్తున్న ఆశావహులు ఇటు ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలతోపాటు ఓపెన్ కేట గిరీలో ఉన్న పద్నాలుగు డివిజన్ల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నుంచి రికార్డు స్థాయిలో 382 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం ఈ విషయంలో సై అంటే సై అన్నట్టుగా ఉంది. ఆ పార్టీ నుంచి 328 నామినేషన్లు పడ్డాయి. ఈ రెండు పార్టీల తర్వాత సీపీఐ నుంచి 125, బీజేపీ నుంచి 123 వంతున నామినేషన్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు తగ్గేదేలే అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి 211 నామినేషన్లు రావడం గమనార్హం.
పేటలో ముందే తేల్చేశారు!
అశ్వారావుపేటలో చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో నామినేషన్లకు ముందే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ప్రధాన పార్టీలు వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ఫలితంగా చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఉన్న 6, 8 వార్డుల నుంచి ప్రధాన పార్టీల తరఫున ఒక అభ్యర్థికి మించి నామినేషన్లు దాఖలు కాలేదు.
అణుశక్తి కమిషన్ చైర్మన్
డాక్టర్ అజిత్‌కుమార్ మహంతి
మేయర్, చైర్‌పర్సన్
పదవులపై దృష్టి
‘పీఠ’ముడి!
‘పీఠ’ముడి!
‘పీఠ’ముడి!


