
కొత్తగా పోడు నరికాడని..
జూలూరుపాడు: అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లఘించి 124 చెట్లు నరకడాన్ని గుర్తించిన అటవీ అధికారులు కేసు నమోదు చేసి, రూ 23 వేలు జరిమానా విధించారు. మండలంలోని రాజారావుపేట బీట్‌ను గురువారం అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్లు లోకనాథం, రాఘవరావు పరిశీలించారు. కంపార్ట్‌మెంట్ 35లో పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండాకు చెందిన నునావత్ రమేష్ అనే వ్యక్తి కొత్తగా పోడు నరికినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా రమేష్‌కు 2006లో 5.5 ఎకరాల పోడు భూమికి ప్రభుత్వం అటవీ హక్కు పత్రాన్ని అందించింది. ఐదున్నర ఎకరాల పోడు భూమిలో సాగు చేయకుండా కొంత భూమి వదిలేశానని, ఆ స్థలంలోని చెట్లు నరికానని బాధిత రైతు రమేష్ చెబుతున్నాడు. హక్కు పత్రాలున్న భూమి పక్కన అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి చెట్లు నరికి కొత్తగా పోడు సాగు చేసేందుకు రమేష్ ప్రయత్నిస్తున్నాడని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో రాజారావుపేట సెక్షన్ ఆఫీసర్ హారిక, బీట్ ఆఫీసర్లు ఎస్కే రహీం, రేఖ పాల్గొన్నారు.
గిరిజన రైతుపై కేసు నమోదు చేసిన
అటవీశాఖ అధికారులు