
చిన్నారుల గాంధీగిరి!
తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు. పాఠశాలలో భగీరథ పైపులైన్ లేక తాగునీరు అందడం లేదని, పైపులైన్ నిర్మాణానికి తవ్వి వదిలేయడంతో రోడ్డు పాడైందని పేర్కొన్న వారు పాఠశాలకు ఇరువైపలా పిచ్చిమొక్కలు తీయించాలని కోరారు. కాగా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు.