
చెట్టును ఢీకొట్టిన బైక్
● సింగరేణి కార్మికుడి మృతి
మణుగూరు టౌన్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెట్టుకు బైక్ ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం ముత్యాలమ్మనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓసీ–2లో డ్రిల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కుమార్ (37) ఉదయం విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని ముత్యాలమ్మనగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో హెల్మెట్ పగిలిపోయి తలకు తీవ్రగాయాలుకాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్‌సైకిల్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగరేణి మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఇతర అధికారులు ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు