
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడుకు చెందిన మడకం దేవా (ఏసీఎం ఏరియా కమిటీ సౌత్ బస్తర్), పార్టీ మెంబర్ మడవి జోగా, మిలీషియా సభ్యులు, పోడియం దేవా, మడకం ఇడుమ, మడకం ముకా, మడవి ఐతా లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణసాయం కింద రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రోహిత్ పేర్కొన్నారు.