
వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్‌ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని 9వ మైలు తండాకు చెందిన మాలోత్ బీక్యా(75) భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదన చెందుతున్నాడు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యం సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా అతడి కుమారుడు గమనించి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.