
ఆదర్శనీయుడు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కొత్తగూడెంఅర్బన్: దేశం గర్వించదగ్గ ఇంజనీర్, ఆదర్శనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా సివిల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో హెడ్డాఫీస్ వద్ద భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా తీసుకుని ఇంజనీరింగ్‌లో ప్రగతి చాటాలని సూచించారు. ఇంజనీర్లు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ విలువలతో కూడిన ఇంజనీరింగ్ పనితనంతో నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సింగరేణి జీఎంలు డి.వెంకటేశ్వర్లు, కె.సాయిబాబు, సీహెచ్.శ్రీనివాస్, టి.వెంకట రామి రెడ్డి, బి.శ్రీనివాస రావు, జీవీ కిరణ్ కుమార్, మురళీధర రావు, ఎస్.వెంకటాచారి, ఎస్.వి.రామమూర్తి , ఎం.కనకయ్య, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌వి.రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీతాంబరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు