
పాఠశాల ప్రారంభం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): మండలంలోని కనకగిరి గుట్టల ప్రాంతంలో ఉన్న రజబ్‌అలీ నగర్‌లో గిరిపుత్రుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బుధవారం ఎంఈఓ ఉండేటి అనంద్‌కుమార్ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రజబ్‌అలీనగర్ 3 కి.మీ. దూరంలో ఉంది. గొత్తికోయ చిన్నారులు పాఠశా లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎంఈఓ ఆనంద్‌కుమార్ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఓ వెంకటరమణ, సీఆర్‌పీలు శిరీష, కృష్ణ, బుచ్చయ్య, వి.వెంకటేశ్వరరావు, జయరాం, శంకర్, మహదేవన్ పాల్గొన్నారు.