
ఏడుగురిపై కేసు
అశ్వాపురం: మండల కేంద్రంలో కాలువబజార్‌లో బుధవారం జరిగిన గొడవ, దాడి కేసులో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలువబజార్‌లో బొల్లం కుమార్ తల్లి ఇటీవల మరణించగా బుధవారం పెద్ద కర్మ నిర్వహించారు. అక్కడికి వచ్చిన కొందరు మద్యం సేవించి గొడవ పడి కుమార్ తండ్రి, బంధువులపై దాడి చేసి గాయపరిచారు. బొల్లం కుమార్ ఫిర్యాదు మేరకు జగ్గారం గ్రామానికి చెందిన నూకల సంపత్, పిండి శ్రావణ్, బాలిన రాజేశ్, నూకల నాగరాజు, నెట్టెం రామకృష్ణపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో నూకల నాగరాజు ఫిర్యాదు మేరకు కొత్తగూడెంనకు చెందిన కాటిబోయిన అరవింద్, జంగిలి శ్రీనివాస్‌పై సీఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.