యాత్రాదానం.. సేవాభావం | - | Sakshi
Sakshi News home page

యాత్రాదానం.. సేవాభావం

Sep 18 2025 7:10 AM | Updated on Sep 18 2025 7:10 AM

యాత్ర

యాత్రాదానం.. సేవాభావం

● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపు

సేవాభావంతో ముందుకు రండి..

● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపు

సత్తుపల్లిటౌన్‌: పుణ్యక్షేత్రాలు, పర్యాటక, విజ్ఞాన విహార యాత్రలను సందర్శించాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం వినూత్నంగా ‘యాత్రా దానం’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పలు యాత్రలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకబస్సులు నడుపుతున్న ఆర్టీసీ యాత్రాదా నం పేరిట ఆదాయాన్ని ఆర్జించేందుకు నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను దాతల సహకారంతో అనాథలు, పేద లు సందర్శించేలా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వీరికి అవకాశం కల్పించేలా..

జిల్లాలోని అనాథలు, ఆశ్రమాలలోని వృద్ధులు, దివ్యాంగులు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టీసీ ‘యాత్రాదానం’తో పర్యాటక, పుణ్య క్షేత్రాల సందర్శనకు తీసుకెళ్తారు. అందుకోసం రీజియన్‌ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల పరిధి లో డిపోమేనేజర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

దాతల చేయూతతో..

పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజులు, పండుగలు తదితర సందర్భాలు, సంతోషకరమైన రోజుల్లో అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఎక్కువగా చేస్తుంటా రు. ఈసందర్భాలలో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాల దర్శ నం కల్పించటానికి ఆర్టీసీకి డబ్బులు విరాళంగా అందజేస్తే బస్సు సదుపాయం కల్పిస్తారు. అలాంటి దాతలు, సంస్థల సేవలను వినియోగించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఎన్‌ఆర్‌ఐలతో పాటు కార్పొరేట్‌ సంస్థలు, స్వస్ఛంద సంస్థలు, సంఘాలు ముందుకు వచ్చి ఆర్టీసీ ‘యాత్రాదానం’లో భాగస్వాములు కావొచ్చు.

మిత్రుల భాగస్వామ్యంతోనైనా..

యాత్రాదానం కార్యక్రమంలో దాతలు ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు సామాజిక సేవ చేశామనే ఆనందం పొందవచ్చు. దాతలు ఏ పుణ్యక్షేత్రానికి యా త్రాదానం చేయదల్చుకున్నారో వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించాలి. యాత్రకు సంబంధించి కిలోమీటర్లను లెక్కించి దాని ప్రాతిపదికన ఏసీ, సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల చార్జీలు వెల్లడిస్తారు. ఆపై బస్సులను ఎంచుకుంటే డిపోల నుంచి కేటాయిస్తారు. యాత్రకు సంబంధించి నగదును ఒకరైనా.. ఇంకొందరితో కలిపైనా చెల్లించవచ్చు.

పుణ్యక్షేత్రాలతో..

ఖమ్మం రీజియన్‌లో ఏడు డిపోలకు గాను మొత్తం 563 బస్సులు ఉన్నాయి. గతంలో జూన్‌ నుంచి పుణ్యక్షేత్రాలు, యాత్రల పేరిట అరుణాచలం తదితర ప్రాంతాలకు ప్రత్యేకరోజుల్లో బస్సులు ఏర్పా టు చేస్తున్నారు. రీజియన్‌ నుంచి 42 బస్సులు నడపగా 25,682 మంది భక్తులు ఉపయోగించుకున్నారు. తద్వారా రీజియన్‌కు రూ.17,03,668 ఆదాయం లభించింది.

సేవాభావంతో ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద

సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి యాత్రాదానానికి సహకరించవచ్చు. సామాజిక సేవలో భాగంగా విరాళాలు ఇస్తే పేదలు పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సుల్లో సందర్శించే అవకాశం లభిస్తుంది. వారం రోజులు ముందుగానే బస్సును బుక్‌

చేసుకోవాలి. –ఎ.సరిరామ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం, ఖమ్మం

యాత్రాదానం.. సేవాభావం1
1/2

యాత్రాదానం.. సేవాభావం

యాత్రాదానం.. సేవాభావం2
2/2

యాత్రాదానం.. సేవాభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement