
జిల్లాకు సంపూర్ణత అభియాన్ అవార్డు
చుంచుపల్లి: వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శనివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు సంపూర్ణత అభియాన్ అవార్డు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం మండల, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజల చొరవకు గుర్తింపుగా నిలిచిందన్నారు. ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని అన్నారు. భవిష్యత్‌లో జిల్లా మరిన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న కలెక్టర్