రామాలయ ఈఓ బదిలీ | - | Sakshi
Sakshi News home page

రామాలయ ఈఓ బదిలీ

Aug 3 2025 3:40 AM | Updated on Aug 3 2025 3:40 AM

రామాల

రామాలయ ఈఓ బదిలీ

● ఆర్‌అండ్‌బీ శాఖకు కేటాయింపు ● భద్రాచలం ఆర్‌డీఓ దేవాదాయ శాఖకు.. ● దామోదర్‌రావుకే ఆలయ ఈఓ బాధ్యతలు ?

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవి బదిలీ అయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఆమె ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవలే ప్రభుత్వం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ క్రమంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు డిప్యుటేషన్‌ ప్రాతిపదికన బదిలీ చేస్తూ శనివారం జీఓ జారీ చేసింది. అలాగే ఇప్పటివరకు భద్రాచలం ఆర్‌డీఓగా విధులు నిర్వహించిన దామోదర్‌రావు దేవాదాయ శాఖకు బదిలీ అయ్యారు.

ఆలయంలో ప్రక్షాళన చర్యలు..

ఆలయ ఈఓగా రమాదేవి 2023 ఫిబ్రవరి 16న ఇన్‌చార్జ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే పలు ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించి మూడు పర్యాయాలు శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను విజయవంతం చేశారు. పారదర్శకత కోసం అన్ని విభాగాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు ప్రవేశపెట్టారు. స్మార్ట్‌ ఫోన్లలో ‘భద్రాచలం టెంపుల్‌ ఇన్‌ఫర్మేషన్‌ (బీటీఐ)’ యాప్‌ను రూపొందించి సేవలను అరచేతిలో ఉంచారు. తాజాగా అకౌంట్లను సైతం ఆన్‌లైన్‌ చేశారు. అవినీతిని అరికట్టి నెలకు రూ.కోటి ఆదాయం వచ్చేలా చూశారు. పురుషోత్తపట్నంలోని ఆలయ భూము ల పరిరక్షణకు పలుమార్లు రంగంలోకి దిగారు.

ఆర్‌డీఓకు ఈఓ బాధ్యతలు ?

భద్రాచలం ఆర్‌డీఓగా ఉన్న దామోదర్‌రావుకు దేవా దాయ శాఖలో సేవలను కేటాయించారు. అయితే రామాలయ ఈఓగా ఆయనకు బాధ్యతలు అప్పగి స్తారనే ప్రచారం సాగుతోంది. రెవెన్యూ శాఖలో ఉన్నప్పటికీ ఇటీవల మాఢ వీధుల విస్తరణలో కీలకమైన భూ సేకరణను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పెద్దలఆశీస్సులు ఉండడంతో ఆయనకే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

రామాలయ ఈఓ బదిలీ1
1/1

రామాలయ ఈఓ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement