జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేసే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేసే వరకూ పోరాటం

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

గుంటూరులో వామపక్షాల నిరసన

లక్ష్మీపురం:చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం నాయకుడు బి.ముత్యాలరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కె.మాల్యాద్రి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ, నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.కృష్ణ, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు యు.నాగేశ్వరరావు, ప్రజాపోరు నాయకులు పి.కోటేశ్వరరావు మాట్లాడారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌ను బీజేపీ జేబు సంస్థగా మార్చి, దేశ రాజ్యాంగాన్ని అపహస్యం చేసిన జ్ఞానేష్‌కుమార్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు, ప్రతిపక్షాలు జ్ఞానేష్‌కుమార్‌ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని, వారికి భయపడి మోదీ ప్రభుత్వం ఢిల్లీలో వేలాది పోలీసులు, సాయుధబలగాలతో నిర్బంధం ప్రయోగిస్తుందని విమర్శించారు. మోదీ పాలన అప్రజాస్వామికంగా, రాచరికాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.లక్ష్మీనారాయణ, ఎంఏ చిష్టి, ఎ.కళ్యాణి, ఎస్‌.పద్మ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్‌ కుమార్‌, మేడా హనుమంతరావు, ఎస్‌.హనుమంతరెడ్డి, దళిత, బహుజన, ప్రజాసంఘాల నాయకులు శిఖా సురేష్‌, బత్తుల వీరాస్వామి, డెన్నీస్‌ రాయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement