లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి వారు చేస్తున్న సమ్మెను విరమింపచేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ, నగర కార్యదర్శి బి.ముత్యాలరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.రమణ కోరారు. శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో భాగంగా నిర్వహిస్తున్న శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం చేస్తూ వారి సేవలో తరిస్తుందని, కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపటం లేదని విమర్శించారు.


