క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

బాపట్ల: ఈ–క్రాప్‌లో పంట నమోదును క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం కంకటపాలెం గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఈ – క్రాప్‌ యాప్‌లో నమోదైన పంట వివరాల మేరకు కంకటపాలెం నుండి చెరువు జమ్ములపాలెం మధ్య మార్గంలో గల నల్లమోతు శాంతకుమారికి చెందిన 70 సెంట్లు పొలంలో వేసిన వరి పంటను ఆయన పరిశీలించారు. పొలాలకు సంబంధించి ఇరువైపులా ఉన్న హద్దులను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. హద్దులను గ్రామ మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. పొలంలో వరి ఏ విధంగా, ఎప్పుడు వేశారని అడిగి తెలుసుకున్నారు. వరి పంట సాగుకు కావలసిన నీటి లభ్యతపై ఆయన ఆరా తీశారు. నీటిని కాలువ నుంచి మోటార్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వర్షపాతం తక్కువగా ఉన్నందున ఇలా చేయవద్దని ఆయన అన్నారు. మోటార్లను వెంటనే తొలగించాలని రైతులకు సూచించారు. కంకటపాలెం గ్రామం నుండి చెరువు జమ్ములపాలెంకు వెళ్లే మార్గంలో రోడ్డు కావాలని రైతులు కోరారు. అంచనా తయారు చేసి వీబీ జీ రాంజీ పథకం కింద ప్రతిపాదనలు తయారుచేయాలని ఎంపీడీవోను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్‌డీవో హరికుమార్‌, తహసీల్దార్‌ సలీమా, మండల వ్యవసాయ అధికారి శారద, బాపట్ల ఎంపీడీవో బాబురావు, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement