జాతీయ ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

● ‘చలపతి చెస్‌ క్లబ్‌‘, చదరంగం పోటీలు ప్రారంభం ● హాజరైన ఎంపీ భాష్యం రామకృష్ణ, చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి

తాడికొండ: చలపతి విశ్వవిద్యాలయ ప్రాంగణం అఖిల భారత ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ చదరంగ సందడితో శనివారం కళకళలాడింది. ‘చలపతి చెస్‌ క్లబ్‌’ను రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ప్రపంచ ప్రఖ్యాత చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి ప్రారంభించారు. ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసంలో చదరంగం ఒక ముఖ్యమైన పాఠ్యాంశమని, ఇది ఆలోచనాశక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్‌ాధ్యన్ని పెంపొందిస్తుందన్నారు. కోనేరు హంపి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్థాయిలో చదరంగానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. చెస్‌ కార్యకలాపాల అభివృద్ధికి తన సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. చాన్సలర్‌ డాక్టర్‌ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ చలపతి విశ్వవిద్యాలయం విద్యతో పాటు ఆటలు, క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రో–ఛాన్సలర్‌ వై సుజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విశ్వ విద్యాలయంలో చదరంగాన్ని పాఠ్యాంశాలలో భాగంగా ప్రవేశపెట్టామని, విద్యార్థులందరికీ చెస్‌ సాధన కోసం ప్రత్యేక సమయ కేటాయింపులను విస్తరించామని వెల్లడించారు. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ బీవీ చౌదరి మాట్లాడారు.

చాంపియన్‌గా ధ్రువేష్‌..

టోర్నమెంట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 242 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతి రౌండ్‌ హోరాహోరీగా సాగిన పోరులో అద్భుతమైన ఆటతీరు, చురుకై న ఎత్తుగడలతో ఆకట్టుకున్న ధ్రువేష్‌ దొంతాపాటి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని చాపియన్‌న్‌గా నిలిచారు. చివరి వరకు గట్టి పోటీనిచ్చిన పెరిచెర్ల హరిరామ్‌ సాయికృష్ణ ద్వితీయ స్థానంతో రన్నర్‌గా నిలవగా, నిలకడైన ప్రదర్శనతో శివ పవన్‌ తేజ తృతీయ స్థానాన్ని సాధించారు. కె రాజు నాలుగో స్థానంలో ఆర్‌ ఆదిత్య ఐదవ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు, రూ.1,11,999/– విలువైన నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్‌ నాదెండ్ల రామారావు, కోనేరు అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement