జిల్లా పంచాయతీ అధికారిగా నగేష్‌కుమారి | - | Sakshi
Sakshi News home page

జిల్లా పంచాయతీ అధికారిగా నగేష్‌కుమారి

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

బాపట్లటౌన్‌: బాపట్ల జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి టి.నగేష్‌ కుమారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన కె.ఎల్‌. ప్రభాకర్‌ పదోన్నతిపై బదిలీ అయిన నేపథ్యంలో, కావలి డివిజనల్‌ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న టి.నగేష్‌ కుమారిని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు చేపట్టిన టి.నగేష్‌కుమారిని బాపట్ల, చీరాల మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆకులు తింటూ వినూత్న నిరసన

బాపట్లటౌన్‌: ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని ఎల్‌ఐసీ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె.రవికిరణ్‌ అన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆరోగ్యశాఖ కాంట్రాక్టర్‌ ఉద్యోగులు డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ముందు చేస్తున్న ధర్నా శనివారం నాటికి మూడోరోజుకు చేరింది. ధర్నాలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆకుకూరలు తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కె.రవికిరణ్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న వీరికి ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా వైద్యశాలల నుంచి స్టాఫ్‌నర్స్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఫార్మాసిస్ట్‌లు, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌లు, రేడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ డీసీకి మరో పీహెచ్‌డీ

నెహ్రూనగర్‌: గుంటూరు జిల్లా ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ (డీసీ) డాక్టర్‌ కె.శ్రీనివాసులు డాక్టరేట్‌ (పీహెచ్‌డీ) సాధించారు. రాయలసీమ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఆయన సమర్పించిన పరిశోధనా పత్రానికి గాను ఈ డాక్టరేట్‌ లభించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖలో సమాచార హక్కు చట్టం–2005 అమలు తీరు’ అనే అంశంపై ఆయన లోతైన పరిశోధన చేసి థీసిస్‌ సమర్పించారు. అదే విధంగా గతంలో 2011లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ’మద్యం వినియోగం– విద్యార్థుల గోల్స్‌పై ప్రభావం’ అనే అంశంపై ఆయన తొలిగా డాక్టరేట్‌ పొందారు. సమాచార కమిషనర్లు, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో ఈ పరిశోధనను పూర్తి చేసినట్లు తెలిపిన ఆయన, ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

గురుకుల ఉద్యోగుల

సమస్యల పరిష్కారానికి కృషి

ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

గుంటూరు మెడికల్‌: గురుకుల విద్యాలయాలు ఒక ప్రత్యేక ఆశయంతో ఏర్పాటైన సంస్థలని, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. గురుకుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ జేఏసీ పూర్తి సహకారం అందిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరులోని ఎన్జీవో హోంలో శనివారం గురుకుల ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాగభూషణం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి విద్యాసాగర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నాయకత్వం సమర్థవంతంగా, ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఇతర శాఖల కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు గురుకుల కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ పలు అంశాలకు సంబంధించిన ఉత్తర్వులను వేగవంతంగా విడుదల చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల ఉద్యోగ సంఘాల నాయకులు నాగభూషణం, రేమి బాబు, హర్షవర్ధన్‌, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షరీఫ్‌, జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్యామ్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement