బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jun 29 2026 2:11 AM | Updated on Jun 29 2026 2:11 AM

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026 తమ్ముళ్లను సర్‌చేసేదెవరు? మార్టూరు: పర్చూరు నియోజకవర్గంలో 2,30,196 మంది ఓటర్లు ఉండగా 295 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలకుగాను మార్టూరు మండలంలో 72 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం ప్రతి బూత్‌నకు ఎన్నికల కమిషన్‌ తరఫున ఒక బీఎల్‌ఓ (బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌) ఉంటారు. ఈ బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల కమిషన్‌ ద్వారా తమకు అందజేసిన ఎన్యూమరేషన్‌ ఫారంలో ఓటర్ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాల్లో ఓటర్ల ఆధార్‌ నెంబర్‌, ఫోన్‌ నంబర్లతోపాటు ఇతర వృత్తిపరమైన, వ్యక్తిగత వివరాలు సైతం ఉండాలి. ఓటర్ల నుంచి నేరుగా తెలుసుకుని పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలు ఎన్నికల విధులు నిర్వహించే తమ పైఅధికారులకు మాత్రమే అందజేయాలి. వాస్తవంగా సర్‌ తాలూకు పూర్తి స్వరూపం ఇది. ఫోన్‌ ద్వారా నేరుగా అనుసంధానం కానీ క్షేత్రస్థాయిలో ఇలా జరగటం లేదు. 70 నుంచి 80 శాతానికి పైగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల సమాచారాన్ని సేకరించకుండా ఆయా బూత్‌లోని ఓటర్లందరినీ ఒక ప్రభుత్వ పాఠశాల లేక సచివాలయాల వంటి చోటుకు సామూహికంగా పిలిపించి అందరి సమక్షంలో వివరాలు సేకరిస్తూ ఫారాలను పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారంను బీఎల్‌ఓతో కలసి పర్యటిస్తున్న అధికార పార్టీ బీఎల్‌ఏ (బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌) తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసుకొని అదే ఫొన్లో ఉన్న మై టీడీపీ యాప్‌లోకి నేరుగా అనుసంధానించటంతో ఓటర్ల వ్యక్తిగత వివరాలు టీడీపీ వెబ్‌సైట్లోకి శాశ్వతంగా అనధికారికంగా ప్రవేశిస్తున్నాయి. ఈ తతంగం అంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ దీనిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వివరాల చోరీ జరిగిపోతోంది. దీనికి సగానికిపైగా బీఎల్‌ఓలు నేరుగా సహకరిస్తుండగా మిగిలిన వారు బదిలీల భయంతో, నాయకుల దౌర్జన్యాలకు భయపడి సహకరిస్తూ ఉండటం గమనార్హం. ఈ విషయమై బీఎల్‌ఓలు వారిలో వారు అంతర్గతంగా చర్చించుకుంటూ భయంతో కొంతమంది మీడియాకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలంటూ ఎన్నికల కమిషన్‌తోపాటు కోర్టులు సైతం ఆదేశిస్తున్నప్పటికీ జిల్లాలో ఓటర్ల వివరాలు చోరీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల వివరాలు చోరీ చేయటం తదనంతరం వారిని నయానో భయానో తమకు అనుకూలంగా మలుచుకోవడం కచ్చితంగా ఫలానా వారు తమకు ఓటు వేయరు అనుకున్న వారి ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అనుమానంతో బీఎల్‌ఓలు బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వహిస్తున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రగా సిబ్బంది భావిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

గత ఎన్నికల్లో తేడా 10 శాతం మాత్రమే..

గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 40 శాతం ఓట్లు సాధించి కేవలం 10 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి గమనార్హం. ఇప్పటికే గడచిన రెండేళ్లలో అవినీతి, అరాచకాలు ఎక్కువ కావడంతో ఒకవైపు వచ్చే ఎన్నికల్లో కూటమిలో సఖ్యత ఏ మేరకు అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు అభద్రతాభావంతో అధికార పార్టీ ఈ ఓటర్ల వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తున్నట్లు బీఎల్‌ఓలు, సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓటర్ల వ్యక్తిగత వివరాలు ఒక రాజకీయపార్టీ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లటం ప్రజాస్వామ్యానికి తీరని నష్టమే. ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి సారించి బీఎల్‌ఓలు ఓటర్ల వివరాలను మూకుమ్మడిగా సేకరించడం, ఎన్యూమరేషన్‌ ఫారాలను అధికార పార్టీకి చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల చేతికి పోకుండా చూసేలా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

దుర్గమ్మ ఆలయానికి విరాళం

సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026
తమ్ముళ్లను సర్‌చేసేదెవరు?

బీఎల్‌ఓల నుంచి ఓటర్ల వివరాలను

చోరీ చేస్తున్న టీడీపీ నేతలు

‘మై టీడీపీ’ యాప్‌లో నేరుగా

సమగ్ర సమాచారం నమోదు

వ్యవహారం తమకు చుట్టుకుంటుందని

ఎన్నికల సిబ్బందిలో భయం

పికిల్‌బాల్‌ ఆటలో

రాణిస్తున్న నగర క్రీడాకారులు

అసోసియేషన్‌ చొరవతో

అందుబాటులో వసతులు

సంఘటన స్థలంలో గుమికూడిన జనం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ):దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి తెనాలి మారీస్‌పేటకు చెందిన అట్లూరి బాపూజీ కుటుంబం రూ.2,01,116 విరాళాన్ని అందజేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ‘సర్‌’ రాష్ట్రంలో పక్కదారి పడుతోందా?... ఓటర్ల వ్యక్తిగత వివరాలు చొరీకి గురవుతున్నాయా?.. ఇదీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది మధ్య అంతర్గతంగా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. చోటుచేసుకుంటున్న పరిణామాలు వీటికి బలం చేకూర్చటం గమనార్హం. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలుస్తోంది. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని జరుగుతున్న ఈ తంతును గమనిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement