మూఢ నమ్మకాలు తొలగించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

మూఢ నమ్మకాలు తొలగించేందుకు కృషి

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

చిలకలూరిపేట: సమాజంలో మూఢ నమ్మకాలు తొలగించి సైన్స్‌ పట్ల అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తున్నదని వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.చలపతిరావు చెప్పారు. పట్టణంలోని రోటరీ హాలులో జనవిజ్ఞాన వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో పాఠశాల స్థాయి సైన్స్‌ చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది జేవీవీలో 800 సభ్యులను చేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ప్రచురణల విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ దార్ల బుజ్జిబాబు మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక సైన్స్‌ ప్రచారంలో విస్తృత సేవలు అందిస్తున్నదని చెప్పారు. అక్షరాస్యత పెంపు, సారా వ్యతిరేక ఉద్యమాల్లో తన పాత్ర పోషిస్తున్నదని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు జేవీవీలో చేరి నూతన సమాజ ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని కోరారు. 2026 సభ్వత్వ నమోదు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పీవీ సుబ్బారావు, టి ప్రతాపరెడ్డి, చుక్కా విన్సెంట్‌పాల్‌, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement