బాపట్ల: పోలియో రహిత భారతదేశం మనందరి లక్ష్యం కావాలని జిల్లా కుష్ఠు, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ వి. సోమల నాయక్ పేర్కొన్నారు. పోలియో అనేది చిన్నారుల్లో శాశ్వత అంగవైకల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని తెలిపారు. పల్స్‌పోలియో సందర్భంగా ఆదివారం కర్లపాలెం, చందోలు, వెదులపల్లి, అప్పికట్లల్లో జరిగిన పోలియోచుక్కల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కుష్ఠు, క్షయ నియంత్రణ అధికారి
డాక్టర్ వి.సోమలనాయక్


