న్యూస్‌రీల్
జగన్ వస్తేనే మంచిరోజులు..
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
●
రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. దీనిలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతోంది. ఒక్క మొక్కజొన్నకే కాకుండా ఏ పంటకు కనీసం మద్దతు ధర లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతుకు క్రమం తప్పకుండా న్యాయం జరిగేది, ఇప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది.
– పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి,
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు
కనీస మద్దతు ధరలేక, ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాకతో మంచి రోజులొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మొక్క జొన్న కొనేందుకు డబ్బులు లేవనడం వారి చేతకాని తనానికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న విషయం ప్రజలకు తెలీదనుకుంటున్నారా..?
– అంబటి రాంబాబు,
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు,


