తీరంలో ఇసుక దిబ్బల తొలగింపుపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

తీరంలో ఇసుక దిబ్బల తొలగింపుపై ఫిర్యాదు

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

వేటపాలెం: రామాపురం సముద్రతీరంలో ఇసుక దిబ్బల తొలగింపుతో తమ జీవనాధారానికి భంగం కలుగుతుందని మత్స్యకారులు ఆదివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రికి ఆన్‌లైన్‌లో... కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఈ– మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. రామాపురం పరిధిలో సముద్ర అలల నుంచి 200 మీటర్లలో నో డెవలప్‌మెంట్‌ జోన్‌ పరిధిలో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించడాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నో డెవలప్మెంట్‌ జోన్‌ ప్రధానంగా తీర ప్రాంత పర్యావరణాన్ని రక్షించడం, తుపాన్లు, సునామీల నుంచి కాపాడటానికి ఇసుక తిన్నలు ఉంటాయి. అలాగే మత్స్యకారులు జీవనాధారాన్ని పరిరక్షించకుండా అందుకు భిన్నంగా అక్రమంగా రిసార్ట్స్‌ నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ఏర్పాటు, ఇసుక తిన్నెలు తొలగించడం వల్ల తీర ప్రాంత పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంట మడ అడవులను పెంచడానికి మత్స్యకారులను ప్రోత్సహించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

రాష్ట్ర తీరప్రాంత నిర్వహణ అథారిటీ అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నో డెవలప్మెంట్‌ జోన్‌లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదుల్లో వారు పేర్కొన్నారు. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పోలీసులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మానవ హక్కుల కమిషన్‌ను

ఆశ్రయించిన మత్స్యకారులు

Advertisement
 
Advertisement
Advertisement