రాజుపాలెం: మండల కేంద్రంలోని రాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ వారి ఆలయ జీర్ణోద్ధరణ, వాయు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం అధిక సంఖ్యలో మహిళా భక్తులు జలబిందెలతో తరలివచ్చి అభిషేకం నిర్వహించారు. ముందుగా వెయ్యిన్నొక్క మంది మహిళలు జలబిందెలు తలపై పెట్టుకుని బ్యాండ్‌మేళాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి జలబిందెలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు అరవపల్లి ఫణికేశవ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.


