జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌కు అటానమస్‌ హోదా | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌కు అటానమస్‌ హోదా

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

నరసరావుపేటరూరల్‌: జేఎన్‌టీయూఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంపస్‌కు అటానమస్‌ హోదా కల్పించనున్నట్టు జేఎన్‌టీయూకె వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. కళాశాల వార్షికోత్సవ, క్రీడోత్సవాలు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఎఫెక్ట్రానిక్స్‌ సంస్థ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ మాట్లాడుతూ జేఎన్‌టీయూఎన్‌ కాకాని క్యాంపస్‌లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యా, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైఎస్‌ కిషోర్‌బాబు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: 2018 జూలై నెలనుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్‌ విభాగం రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్‌ విభాగం రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement