ఆల్కాహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది కాబట్టి మద్యం జోలికి వెళ్లవద్దు. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినవద్దు. ఉప్పు, చక్కెర , రెడ్‌మీట్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. పచ్చని ఆకు కూరలు తినటం వల్ల లివర్‌ను శుభ్రంగా ఉంచుతాయి. ఆలీవ్ ఆయిల్స్, వాల్‌నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు, వెల్లులి పాయలు, పసుపు లివర్‌కు మేలు చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కాలేయం వద్ద పేరుకుపోయే కొవ్వును నియంత్రణ చేస్తుంది. రోజూ నీటిని ఎక్కువగా తాగటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
– డాక్టర్ షేక్ నాగూర్ బాషా,
గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్


