లివర్ క్యాన్సర్లు రావటానికి హెపటైటిస్– బీ, హెపటైటిస్–సీ వ్యాధులే కారణం. కామెర్ల వ్యాధి(జాండీస్) సోకిన వారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో హెపటైటిస్ వైరస్ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ హెపటైటిస్‌కు దారి తీసి కొన్నేళ్ల తరువాత లివర్ దెబ్బతినటానికి కారణమవుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ వస్తుంది.
–డాక్టర్ బైరపనేని స్రవంతి,
క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు


