గరికపాటికి లీగల్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

గరికపాటికి లీగల్‌ నోటీసు

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్‌, వేములపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పట్టణ అయితానగర్‌లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్‌, శ్రీనివాస్‌ మాట్లాడారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్‌ బొప్పూరి పవన్‌కుమార్‌ అభ్యర్థనతో తాము లీగల్‌ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) ప్రకారం వాక్‌స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా ఉన్నారు.

ఈతకు వెళ్లి యువకుడు మృతి

పట్నంబజారు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పాత గుంటూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సీతానగర్‌కు చెందిన పొదుకూరి లోకేష్‌ (19) అదే ప్రాంతంలోని కాళికామాత తల్లి ఆలయంలో సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మణిపురం ఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న నీళ్లకుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్‌తో కలిసి మరో ఇద్దరు ఈతకు దిగారు. నీటి కుంట లోతు అంచనా వేయలేని లోకేష్‌ లోపలకు దిగిన క్రమంలో ఈత కొట్టలేక అందులో కూరుకుపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ రెస్క్యూ టీం సిబ్బంది కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పాత గుంటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement