ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా బేస్ బాల్ కార్యదర్శి కే శ్రీను, అజయ్ కుమార్, నరేష్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్‌బాల్ ఎంపిక పోటీలు


