అత్యవసర వైద్య సేవల అనంతరం గుంటూరుకు తరలింపు
కొల్లూరు: ఉద్యోగంలో పనిభారం, అనారోగ్య సమస్యల కారణంగా డిప్యూటీ ఎంపీడీఓ అస్వస్థతకు గురయ్యారు. శనివారం మండలంలోని అనంతవరంలో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వహణలో భాగంగా కొల్లూరు డిప్యూటీ ఎంపీడీఓ సింహాద్రి నిరంజన్‌రావు ఉదయమే అనంతవరం చేరుకొని ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. మండుటెండలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర అవగాహనా ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటికే అధిక ఒత్తిడి కారణంగా బీపీ పెరగడంతో స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు అతి కష్టంపై చేరుకున్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలారు. అత్యవసర వైద్య సేవలు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు గుంటూరు వైద్యశాలకు తరలించారు.


