ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

గుంటూరు మెడికల్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. జూనియర్‌ అసిస్టెంట్‌, ఆప్టో మెట్రిక్‌, డీడీఎం, లాబడెండెంట్‌, సోషల్‌ వర్క్‌, టీబీ హెల్త్‌ విజిటర్‌, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు అర్హులైన వారు గుంటూరు.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి చేసి పంపించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 18 నుంచి 30 వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో, లేదా రిజిస్ట్రర్‌ పోస్టులో అందించాలన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ స్టాఫ్‌ గ్రీవెన్‌న్స్‌ (ఎస్పీ – సంపర్క్‌) నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్‌ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్‌ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement