24న గురుకుల ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

24న గురుకుల ప్రవేశ పరీక్ష

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

24న గురుకుల ప్రవేశ పరీక్ష చెరుకుపల్లి: కావూరులోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాల (బాలికల) ప్రవేశ పరీక్ష ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాల (బాలికలు) ప్రిన్సిపాల్‌ కె.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు బాపట్ల జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 5, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాలకు పరీక్ష నిర్విహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ హాల్‌టికెట్స్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పంట కాల్వలోకి కారు బోల్తా కారంచేడు: ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్‌ దిగడంతో అదుపుతప్పిన కారు పంట కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటన శుక్రవారం కారంచేడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కారంచేడు నుంచి ఆదిపూడి మీదగా యర్రంవారిపాలెం వైపునకు వెళ్తున్న కారు ఆదిపూడి రోడ్డులోని డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు ఇండోర్‌ స్టేడియం సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహన్నాఇ తప్పించే క్రమంలో అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు పంటకాలువలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు స్వల్పగాయాలతో బయట పడ్డారని తెలిసింది. వారు వెంటనే బైటకు వచ్చి ప్రథమ చికిత్స నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ గంజాయి కేసులో యువకులకు జైలు గుంటూరు లీగల్‌: మంగళగిరి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన గంజాయి తాగడం, విక్రయించడం సంబంధిత కేసులపై ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన మండెం ఆనంద్‌బాబుపై నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించారు. ఇదే కేసులో మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. మరో కేసులో విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఎస్‌.కె.ఇమ్రాన్‌, గంప కిరణ్‌, ఈడే రాహుల్‌, పెయ్య తరుణ్‌కుమార్‌లపై నేరం నిర్ధారణ కావడంతో ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ ఒకటవ అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రూ.5వేలు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వి.ఏ.ఎల్‌. సత్యవతి వెలువరించారు. ఈ కేసుల్లో ప్రభుత్వ తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.అశోక్‌ వాణి వాదనలు వినిపించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు(ట్విన్స్‌) ఎంఎన్‌వీ అలేఖ్య లావణ్యశ్రీ, ఎంఎన్‌వీ ఆస్రిత రమ్యను జీకేఆర్‌ హైస్కూల్‌ డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జి.జనార్ధన్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్‌ హైస్కూల్లో విద్యార్థినులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఇంటర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరి, జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు వరుసగా 462, 459 మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వేసిన బలమైన పునాది తాము టెన్త్‌, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్‌ జి.శైలజ, జి.సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement