ఎక్సైజ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

ఎక్సైజ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

నెహ్రూనగర్‌: గుంటూరు నగరంలో మద్యం షాపును రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరులో ఎకై ్సజ్‌ శాఖ రీజనల్‌ లేబొరేటరీ, మద్యం శాంపిల్స్‌ని పరిశీలించారు. ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి రోడ్డులోని విజయశ్రీ వైన్‌ షాపులోకి వెళ్లి పరిశీలించి.. షాపునకు వచ్చిన మద్యం కొనుగోలుదారులతో మాట్లాడి మద్యం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకై ్సజ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించి, సామాన్యుల కోసం రూ.99 అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్తీకి అవకాశమే లేకుండా ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ కూడా తీసుకొచ్చామని, ఆ యాప్‌ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌ను ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ చేయడంతో పాటుగా, తయారీ నుంచి ప్రతి వివరాలు ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. షాపు నిర్వాహకులు తప్పనిసరిగా సమయపాలన, ఎమ్మార్పీ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులకు కీలక ఆదేశాలిచ్చామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు గమనిస్తే ప్రజలు స్వచ్చందంగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె శ్రీనివాసులు, ఈఎస్‌ అరుణకుమారి, ఏఈఎస్‌ మారయ్య బాబు, సీఐ బొలిశెట్టి లతా, ఎస్‌ఐలు ఇతర ఇబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement